రేపటి నుంచి ఏపీపీటీడీ ఉద్యోగుల ఆందోళన | - | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి ఏపీపీటీడీ ఉద్యోగుల ఆందోళన

May 19 2026 1:46 AM | Updated on May 19 2026 1:46 AM

మచిలీపట్నంఅర్బన్‌: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ (ఏపీపీటీడీ) ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 20, 21 తేదీల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు ఎస్‌.ఎన్‌.రావు, కార్యదర్శి నాగిరెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. విద్యుత్‌ బస్సులను ప్రభుత్వం, ఆర్టీసీ ద్వారా కొనుగోలు చేసి, సంస్థ సిబ్బందితోనే నిర్వహించాలని సంఘం డిమాండ్‌ చేస్తోందన్నారు. సీ్త్ర శక్తి బస్సుల్లో జీరో టికెట్‌ విధానాన్ని రద్దు చేసి, సాధారణ టికెట్‌ వ్యవస్థను అమలు చేయాలని కోరారు. పీఆర్సీ కమిటీని నియమించి ఐఆర్‌ ప్రకటించాలని, పెండింగ్‌ డీఏలు, అరియర్స్‌, లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ మచిలీపట్నం డిపో కార్యదర్శి ఎం.కిరణ్‌ కుమార్‌, రాజశేఖర్‌, పళ్లెం ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement