వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కై లే అనిల్‌కుమార్
చంద్రబాబు ప్రభుత్వం ఆరోపణలు బూటకమని తేలిపోయింది
వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కై లే అనిల్‌కుమార్
పామర్రు: శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు చేసిన ఆరోపణలు అబద్ధమని ఐసీఏఆర్, ఎన్‌డీడీ ల్యాబ్ రిపోర్టు ద్వారా స్పష్టమైందని, ఇప్పటికై నా చంద్రబాబు నాయుడు జగన్‌పై బురద చల్లడం మానుకోవాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కై లే అనిల్‌కుమార్ హితవు పలికారు. ఆయన గురువారం మాట్లాడుతూ వైఎస్సార్ సీపీపై ఏదో విధంగా బురద జల్లి నోటికి వచ్చినట్లు మాట్లాడే కూటమి ప్రభుత్వ నేతలు ఈ రోజు ఎందుకు మొహం చాటేస్తున్నారని ప్రశ్నించారు. నీచ రాజకీయం లబ్ది కోసం చంద్రబాబు వెంకన్న స్వామి ప్రసాదాన్ని కూడా వాడుకుని కోట్లాది మంది ప్రజల మనోభావాలను దెబ్బతీశారని అన్నారు. ఇప్పటి కై నా జగన్‌పై విమర్శలు మానుకుని ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి ప్రజలకు మంచి పరిపాలనను అందించాలని కోరారు.
ఎముకలు, కండరాల వ్యాధుల స్క్రీనింగ్‌పై శిక్షణ
లబ్బీపేట(విజయవాడతూర్పు): చిన్నపిల్లల్లో ఎముకలు, కండరాల వ్యాధులు(మస్క్యూలో స్కేలేటల్) స్క్రీనింగ్‌పై ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలలో గురువారం శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ శిక్షణలో 14 జిల్లాల్లోని బాలల సత్వర చికిత్స కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యులు, ఫిజియోథె థెరపిస్టులు, పిల్లల మనస్తత్వ నిపుణులు, డీఇఐసీ మేనేజర్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్న పిల్లల్లో మస్క్యూలో స్కేలేటల్ సమస్యలను ప్రారంభదశలో గుర్తించేందుకు నిర్వహించే స్క్రీనింగ్‌పై నిపుణులు అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా స్టేట్ ఆర్‌బీఎస్‌కే నోడల్ అధికారి డాక్టర్ డి.ప్రశాంత్ మాట్లాడుతూ ఎముకలు, కండరాల సమస్యలను ప్రారంభదశలో గుర్తిస్తే జీవితాంతం ప్రభావం చూపే వికలాంగత్వాన్ని నివారించవచ్చునన్నారు. చిన్నపిల్లల ఆరోగ్య సమస్యలపై ముందస్తు స్క్రీనింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే ఈ శిక్షణ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. శిక్షణలో తిరుపతికి చెందిన డాక్టర్ మాధురి స్క్రీనింగ్ ప్రొటోకాల్, ఆధునిక క్లినికల్ విధానాలు, కేస్ బేస్డ్ డిస్కషన్స్, ప్రాక్టికల్ ట్రైనింగ్ అందించారు. కార్యక్రమాన్ని ఆర్‌బీఎస్‌కే జిల్లా డాక్టర్ జి.మాధవి పర్యవేక్షించారు.
అరుణ్ రాజ్‌కుమార్‌కు విశిష్ట రైల్ సేవ పురస్కారం
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): విధుల్లో అత్యుత్తమ ప్రదర్శనకు గాను విజయవాడ రైల్వే డివిజన్ ఉద్యోగి పూసపాటి అరుణ్ రాజ్‌కుమార్‌ను గురువారం సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ విశిష్ట రైల్ సేవా పురస్కారంతో సత్కరించారు. అరుణ్‌రాజ్ కుమార్ జూనియర్ ఇంజినీర్‌గా ఈ–ఆఫీస్ అడ్మినిస్ట్రేటర్‌గా అత్యుత్తమ ప్రదర్శన కనపర్చారు. డిజిటలైజేషన్ విభాగంలో అంతరాయం లేని డిజిటల్ సేవలు, రైల్‌టెల్‌తో చక్కని సమన్వయాన్ని సాధించి అధికారులు, సిబ్బంది పని పక్రియను సులభతరం చేయడంలో ఎంతో కృషిచేశారు. ఆయన ప్రభావవంతమైన కృషి డివిజన్ పరిపాలన సామర్థ్యాన్ని గణనీయంగా మెరుగుపర్చింది. ఆయన కృషికి గాను దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ వర్కింగ్ కమిటీ సభ్యుడు అల్లం రమేష్, బ్రాంచ్ కార్యదర్శి కర్నూల్ సుకుమార్ తదితరులు అభినందనలు తెలిపారు.


