
6, 7 తేదీల్లో రాష్ట్ర, జిల్లా స్థాయి క్రీడా పోటీలు
మచిలీపట్నంఅర్బన్: జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకుని పది రకాల క్రీడాంశాలలో రాష్ట్ర, జిల్లా స్థాయి పోటీలు నిర్వహిస్తున్నట్లు కృష్ణాజిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి ఝాన్సీలక్ష్మి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 6, 7 తేదీలలో గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం, మచిలీపట్నంలలో నిర్వహిస్తామన్నారు. 22 సంవత్సరాల లోపు వయసు గల సీ్త్ర, పురుషులు పాల్గొనవచ్చన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు ముందుగా పేర్లను నమోదు చేసుకోవాలని, వయస్సు నిర్ధారణకు ఆధార్ కార్డు, 10వ తరగతి మార్క్ మెమో పరిగణ నలోకి తీసుకుంటామన్నారు. వివరాలకు గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం ఆఫీసు నంబర్లు 7330907945, 9494643658, మచిలీపట్నంలో అథ్లెట్స్ 8897665820, ఆర్చరీ 9392106401, బాక్సింగ్ 7075848607, షటిల్/బాడ్మింటన్ 9494643658, బాస్కెట్‌బాల్ 8886926773, కబడ్డీ 7981813244, ఖోఖో 9848245468, హాకీ 70137 86846, వాలీబాల్ 9701593234, వెయిట్‌లిఫ్టింగ్ 8522099995 నంబర్లకు సంప్రదించాలన్నారు.
యువకుడి ప్రాణం తీసిన ఈత సరదా
ఇబ్రహీంపట్నం: ఈత సరదా ఓ యువకుడి ప్రాణం తీసింది. ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమం వద్ద శనివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. సేకరించిన వివరాల మేరకు త్రిలోచనాపురానికి చెందిన కలకంటి మాధవి కుటుంబం పశ్చిమ ఇబ్రహీంపట్నంలో అద్దెకు ఉంటున్నారు. ఆమెకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు కె.నవీన్(17) కంచికచర్లలోని ఓ కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. తన ఇద్దరు స్నేహితులతో కలసి సరదాగా ఈత కొడదామని ఫెర్రీ పవిత్ర సంగమం వద్దకు చేరుకుని ముగ్గురూ నదిలో ఈతకు దిగారు. వరద ప్రవాహానికి నవీన్ నదిలో గల్లంతయ్యాడు. మిగతా ఇద్దరు స్నేహితులు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. కృష్ణానదికి వస్తున్న వరద ప్రవాహంతో నిషేధాజ్ఞలు ఉన్న సమయంలో యువకుడు గల్లంతవడం చర్చనీయాంశంగా మారింది. ఓ వైపు పోలీస్, ఎస్డీఆర్‌ఎఫ్, రెవెన్యూ సిబ్బంది నదిలోకి ఎవరూ వెళ్లరాదని ప్రకటనలు గుప్పిస్తున్నారు. రెండు రోజుల క్రితం కలెక్టర్ లక్ష్మీశ ఆ ప్రాంతంలో పర్యటించి జాగ్రత్తలపై అధికారులకు ఆదేశించారు. యువకుడు గల్లంతు కావడం అధికారుల వైఫల్యం ఎత్తి చూపుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.