
ఎడ్లంకకు నిలిచిన రాకపోకలు
అవనిగడ్డ: కృష్ణానదికి వరద ఉధృతి పెరిగింది. పులిగడ్డ అక్విడెక్టు వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. పెరిగిన వరద తాకిడికి ఎడ్లంక కాస్‌వే రహదారికి గండిపడింది. దీంతో ఎడ్లంక ప్రజలు బయటకు రావాలంటే పడవ ప్రయాణమే దిక్కయింది. పడవ ఎక్కిదిగే క్రమంలో వృద్ధులు, విద్యార్ధులు ఇబ్బందులు పడుతున్నారు. ఎడ్లంక వద్ద మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. ఇన్‌చార్జి ఆర్డీవో బి.శ్రీదేవి, డీఎస్పీ విద్యశ్రీ, తహసీల్దార్ నాగమల్లేశ్వరరావు, సీఐ యువకుమార్, ఆర్‌ఐ బాలాజీ, ఎస్‌ఐ శ్రీనివాస్ ఎడ్లంకను సందర్శించి గ్రామస్తులను అప్రమత్తం చేశారు. వరద ఉధృతి పెరిగితే ఇళ్లను ఖాళీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.

ఎడ్లంకకు నిలిచిన రాకపోకలు

ఎడ్లంకకు నిలిచిన రాకపోకలు