
కూటమి ప్రభుత్వం మిథున్‌రెడ్డిని వేధిస్తోంది
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులతో వేధిస్తోందని మాజీ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. విజయవాడలోని కోర్టు సముదాయం వద్ద శుక్రవారం ఎంపీ మిథున్‌రెడ్డిని కలిసేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. మిథున్‌రెడ్డి ఏ తప్పూ చేయకపోయినా తప్పుడు కేసులతో కూటమి ప్రభుత్వం ఆయనను వేధిస్తోందన్నారు. జ్యూడిషియల్ రిమాండ్‌లో ఉన్న ఆయన ఏదో తప్పు చేసినట్లుగా చిత్రీకరించే తీరు బాధ కలిగిస్తోందన్నారు. జైలులో బాత్ రూమ్‌లో తప్ప మిగతా అన్నిచోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మిథున్‌రెడ్డిని వేధిస్తున్నారని, ఇందుకు కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. హెరిటేజ్ సంస్థలో ఏదైనా కేసు వస్తే ఇదేరకంగా చేస్తారా? అని అంటూ నిలదీశారు. మిథున్‌రెడ్డి తాను లైడిటెక్టర్ టెస్ట్‌కు కూడా సిద్ధమేనని చెప్పారని, ఈ ఏడాదికాలంలో ఏ డిస్టిలరీ వద్ద మీరు ముడుపులు తీసుకోలేదని లైడిటెక్టర్ టెస్ట్‌కు సిద్ధమా? అంటూ సీఎం చంద్రబాబుకు సవాల్ చేశారు. మీరు లేదా మేముచెప్పే మీ అనుచరుల పేర్లలో ఎవరినైనా ఈ లైడిటెక్టర్ టెస్ట్‌కు పంపుతారా అని నిలదీశారు. వైఎస్సార్‌సీపీపై బురద జల్లడం మానేసి, ప్రజలకు మేలు చేసే విషయంపై దృష్టి పెట్టాలని కూటమి ప్రభుత్వానికి హితవు పలికారు.
మాజీ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి