
ఆధునిక వైద్యవిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి
లబ్బీపేట(విజయవాడతూర్పు): వైద్యులంతా ఆధునిక వైద్యవిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ప్రజలకు మెరుగైన సేవలందించాలని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ పి.చంద్రశేఖర్ సూచించారు. ఇండియన్ నెఫ్రాలజీ సొసైటీ సదరన్ చాప్టర్ 44వ వార్షిక సదస్సు విజయవాడలోని ఎస్‌ఎస్ కన్వెన్షన్‌లో శుక్రవారం ప్రారంభమైంది. వీసీ మాట్లాడుతూ ఆధునిక వైద్యచికిత్సా విధానాలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, నవీన ఔషధాలపై అవగాహన పెంపొందించుకునేందుకు ఈ సదస్సు వేదికగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ డి.శ్రీహరిరావు, సదస్సు ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ ఎన్.అమ్మన్న, 600మంది ప్రతినిధులు పాల్గొన్నారు.