ఆసిఫాబాద్రూరల్: జిల్లా విద్యార్థినులు రాష్ట్రస్థాయి జూనియర్ ఖోఖో పోటీలకు ఎంపికయ్యారని డీఎస్వో షేకు తెలిపారు. జిల్లా కేంద్రంలోని క్రీడాపాఠశాల ఆవరణలో బుధవారం క్రీడాకారులను కోచ్లు తిరుమల్, రవి, రాకేశ్తో కలిసి అభినందించారు. ఉమ్మడి జిల్లా జూనియర్స్ ఖోఖో పోటీల్లో గిరిజన ఆదర్శ క్రీడాపాఠశాలకు చెందిన నాగేశ్వరి, శ్రీలత, వైష్ణవి, సరోజ, గీతాంజలి, గిరిజన బాలికల పాఠశాలకు చెందిన సోని, అక్షిత, జంగుబాయి, సత్యశీల, అశ్విని, సాగరిక సత్తా చాటారన్నారు. వీరంతా ఈ నెల 15 నుంచి 17 వరకు హైదరాబాద్లో సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.


