జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో బుధవారం సాయంత్రం జిల్లా మహిళాశిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు ఘనంగా జరుపుకొన్నారు. కలెక్టర్ కె.హరిత గౌరమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. మహిళా అధికారులు, ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడారు. బతుకమ్మ పండుగ ద్వారా మన సంస్కృతిని భావితరాలకు అందించాలన్నారు. తెలంగాణ సంప్రదా యాల గొప్పదనాన్ని చాటి చెప్పాలని సూచించారు. అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, డేవిడ్, జిల్లా సంక్షేమ అధికారి స్వరూపారాణి తదితరులు పాల్గొన్నారు. – ఆసిఫాబాద్


