అన్నదాతల ఐకమత్యం | - | Sakshi
Sakshi News home page

అన్నదాతల ఐకమత్యం

Oct 15 2026 8:36 AM | Updated on Oct 15 2026 8:36 AM

సాగునీటి కాలువకు రైతుల శ్రమదానం రూ.40 వేల సొంత ఖర్చులతో మరమ్మతులు పొలాలకు చేరిన బొక్కివాగు ప్రాజెక్టు నీరు

పెంచికల్‌పేట్‌: రైతుల ఐకమత్యం ముందు సమస్య తలవంచింది. పంటను కాపాడుకోవాలన్న తపనతో ఏకమై ప్రభుత్వసాయం కోసం ఎదురుచూడకుండా సొంతంగా డబ్బు సమకూర్చుకుని సాగునీటి కాలువకు మరమ్మతులు చేసుకున్నారు. పెంచికల్‌పేట్‌ మండలంలోని ఎల్లూర్‌ బొక్కివాగు ప్రాజె క్టు ఎడమ కాలువ కింద మెరెగూడ, ఎల్లూర్‌, పెంచికల్‌పేట్‌, కోయచిచ్చాల గ్రామాలకు చెందిన రైతులు 300 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. ప్రాజెక్టు ఎడమ కాలువకు గండిపడటంతో పంట పొలాలకు నీరు పారడం లేదు. వర్షాధారంతో సాగు చేసిన వరికి చివరి తడి అందక ఎండిపోతోంది. ఈ క్రమంలో పంటను రక్షించుకోవడానికి అన్నదాతలు స్వ చ్ఛందంగా రూ. 40వేలు జమ చేశారు. జేసీబీ, ట్రా క్టర్లతో కాలువలో ఉన్న పూడిక, చెత్తాచెదారం, మట్టి ని తొలగించారు. గండి పడిన చోట సిమెంటు పైపులు వేశారు. కాలువకు ఇరువైపులా సిమెంట్‌ ఇటుకలతో గోడ కట్టారు. రైతులు కార్మికులుగా మారి పంటకు నీరు వచ్చే వరకు విశ్రమించలేదు. దీంతో సోమవారం ప్రాజెక్టు గేటు నుంచి కుడి కాలువ నుంచి సాగునీరు పంట పొలాలకు చేరింది.

ఏటా ఇదే తంతు..

ప్రభుత్వం రెండు వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించాలనే సంకల్పంలో 2012లో బొక్కివాగు ప్రాజెక్టు నిర్మించింది. కుడి, ఎడమ కాలువలు పూర్తిగా దెబ్బతినడంతో ప్రాజెక్టులో పుష్కలంగా నీరున్నా పొలాలకు చేరడం లేదు. ప్రజాప్రతినిధులు, అధికారులకు పలుమార్లు సమస్య పరిష్కరించాలని విన్నవించినా పట్టించుకోవడం లేదు. నిత్యం పర్యవేక్షించాల్సిన అధికారులు ప్రాజెక్టు, కాలువల వైపు కన్నెత్తి చూడడం లేదు. ఏటా రైతుల సొంత ఖర్చులతో పంట పొలాలకు నీటిని అందించడానికి కష్టాలు పడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement