బోర్‌ పనులు అడ్డుకోవడంపై ఆగ్రహం | - | Sakshi
Sakshi News home page

బోర్‌ పనులు అడ్డుకోవడంపై ఆగ్రహం

Feb 13 2026 3:44 AM | Updated on Feb 13 2026 3:44 AM

బోర్‌ పనులు అడ్డుకోవడంపై ఆగ్రహం

బోర్‌ పనులు అడ్డుకోవడంపై ఆగ్రహం

● మోతిగూడలో అటవీ అధికారులతో గ్రామస్తుల వాగ్వాదం ● సమస్యలు పరిష్కరిస్తామని కలెక్టర్‌ హరిత హామీ

లింగాపూర్‌: మండలంలోని జాముల్‌ధర పంచా యతీ పరిధిలో గల మోతిగూడలో బుధవారం ఉద్రి క్తత నెలకొంది. తాగునీటి సమస్యల పరిష్కారం కోసం బోర్‌ వేసేందుకు వాహనం రాగా అటవీశాఖ అధికారులు అడ్డుకున్నారు. దీంతో గ్రామస్తులు, అటవీశాఖ అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. అర్ధరాత్రి వరకు గ్రామస్తులు రోడ్డుపైనే బైఠాయించి వంటావార్పుతో నిరసన తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న డీసీసీ అధ్యక్షురాలు గ్రామానికి వెళ్లి స్థానికుల సమస్యలు తెలుసుకున్నారు. కలెక్టర్‌ను ఫోన్‌లో సంప్రదించి పరిస్థితిని వివరించారు. గురువారం ఉదయం కలెక్టర్‌ కె.హరిత, జిల్లా అటవీశాఖ అధికారి నీరజ్‌కుమార్‌ టిబ్రేవాల్‌, రెవెన్యూ అధి కారులు గ్రామానికి చేరుకుని స్థానికులతో సమావేశమయ్యారు. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కా రం చూపుతామని హామీ ఇచ్చారు. అటవీ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశా రు. అనంతరం డీసీసీ అధ్యక్షురాలు బోరు పనులు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement