బాల్యవివాహాల నివారణకు ముందస్తు చర్యలు | - | Sakshi
Sakshi News home page

బాల్యవివాహాల నివారణకు ముందస్తు చర్యలు

Feb 13 2026 3:44 AM | Updated on Feb 13 2026 3:44 AM

బాల్యవివాహాల నివారణకు ముందస్తు చర్యలు

బాల్యవివాహాల నివారణకు ముందస్తు చర్యలు

ఆసిఫాబాద్‌రూరల్‌: పెళ్లిళ్ల సీజన్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో బాల్యవివాహాల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని డీసీపీవో మహేశ్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని డీసీపీవో కార్యాలయంలో గురువారం వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. జిల్లాలో బాలల హ క్కుల సంరక్షణకు అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. గ్రామస్థాయి బాల సంరక్షణ కమిటీలను మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు. బాల్య వివాహాల నిర్మూలన, బాలలపై జరుగుతున్న నేరాలను అడ్డుకునేందుకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బాల రక్షాభవన్‌ సిబ్బంది ప్రవీణ్‌ కుమార్‌, చంద్రశేఖర్‌, జమున, ఝాన్సీరాణి, నవీన్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement