నైపుణ్యాభివృద్ధికి సీఎం కప్ పోటీలు
ఆసిఫాబాద్‌రూరల్: క్రీడాకారుల్లో నైపుణ్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ పోటీలు నిర్వహిస్తోందని అదనపు కలెక్టర్, డీఈవో దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరి జన ఆదర్శ క్రీడాపాఠశాలలో గురువారం జి ల్లాస్థాయి సీఎం కప్ పోటీలను ప్రారంభించా రు. గ్రామీణ క్రీడాకా రులను వెలుగులోని తీసుకువచ్చేందుకు ప్ర భుత్వం పోటీలు నిర్వహిస్తుందన్నారు. గ్రామీణ యువత క్రీడారంగంలో రాణించాలని సూచించారు. జిల్లాస్థాయిలో ఉత్తమ ప్రతిభ చూపిన వారిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో డీవైఎస్‌వో అశ్వక్, డీఎస్‌వో షేకు, పీడీలు మీనారెడ్డి, రాకేశ్ పాల్గొన్నారు.


