హక్కులపై అవగాహన అవసరం
సిర్పూర్(టి): బాలికలకు చట్టాలపై అవగాహ న అవసరమని జిల్లా సైన్స్ అధికారి కటకం మధుకర్ అన్నారు. మండలంలోని వేంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువా రం అంతర్జాతీయ బాలికల దినోత్సవం ఘ నంగా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థినులు పరిశుభ్రత, టాయిలెట్ నిర్వాహణ, మహిళల రక్షణ గురించి తెలుసుకో వాలన్నారు. బాలికలు అభివృద్ధి చెందితేనే కుటుంబ, సమాజం, దేశాభివృద్ధికి బలమైన పునాది ఏర్పడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు శాంతికుమారి, మాధవి, లక్ష్మీనారాయణ, ఓంప్రకాశ్, శ్రీనివా స్ తదితరులు పాల్గొన్నారు.


