నాలుగు లేబర్ కోడ్‌లు రద్దు చేయాలి
ఆసిఫాబాద్‌రూరల్: కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్‌ల ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గురువా రం చేపట్టిన సార్వత్రిక సమ్మెలో భాగంగా జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట కార్మిక, ఉద్యోగ, యువజన సంఘాల జేఏసీ నాయకులు ధర్నా చేపట్టారు. జేఏసీ నాయకులు ఉపేందర్, రాజేందర్, తిరుపతి, ఓదెలు మాట్లాడుతూ నాలుగు లేబర్ కోడ్‌లు, విద్యుత్ సవరణ చట్టం– 2025, వీబీ జీ రాం జీ చట్టం, విత్తన సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరుతో ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులు, బ్యాంకు, ఇన్సురెన్స్, పబ్లిక్ సెక్టార్లలో పనిచేసే వారికి అన్యాయం జరుగుతుందన్నారు.


