క్రికెట్ పోటీల విజేత ‘తిర్యాణి’
రెబ్బెన: పీఆర్టీయూ టీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గోలేటి టౌన్‌షిప్‌లోని భీమన్న స్టేడియంలో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి ఉపాధ్యాయుల క్రికెట్ పోటీలు గురువారం ముగిశాయి. పో టీలో జిల్లాలోని 15 మండలాల నుంచి 16 జట్లు పా ల్గొన్నాయి. ఫైనల్‌లో తిర్యాణి మండల ఉపాధ్యాయుల జట్టు నిలవగా, బెజ్జూర్ మండల ఉపాధ్యాయుల జట్టు రెండోస్థానంలో నిలిచింది. బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ విజయ భాస్కర్‌రెడ్డి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక ఆరోగ్యాన్ని కలిస్తాయన్నారు. విద్యతోపాటు ఆటలు కూడా ఎంతో అవసరమని పేర్కొన్నారు. విద్యాభివృద్ధికి ఉపాధ్యాయులు చేస్తున్న కృషి ఎంతో గొప్పదని కొని యాడారు. కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి అనిల్‌కుమార్, మండల అధ్యక్షుడు బత్తుల సదానందం, ఎంఈవో వెంకటేశ్వర్లు, నాయకులు నరసింహచారి, ప్రకాశ్, సాంబశివరావు, భిక్షమయ్య, సత్యనారాయణ, రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.


