
సత్ప్రవర్తనతో మెలగాలి
ఆసిఫాబాద్‌అర్బన్: వివిధ కారణాలతో జైలు జీవితం అనుభవిస్తున్న ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలని సీనియర్ సివిల్ జడ్జి యువరాజ సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలోని సబ్‌జైలులో న్యాయ విజ్ఞాన సదస్సు ని ర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. క్షణికావేశంలో అనాలోచితంగా చే సిన తప్పులకు జీవితాంతం బాధపడాల్సి వ స్తుందని, అందుకే ఆవేశపూరితంగా తప్పులు చేయకూడదని సూచించారు. అనంతరం జైలులోని వంట గదిని పరిశీలించారు. ఖైదీల ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. సబ్ జైలు సూపరింటెండెంట్ ప్రేమ్‌కుమార్, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అంజనీదేవి తదితరులు పాల్గొన్నారు.