
రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం
ఆసిఫాబాద్‌రూరల్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లిని కించపరిచేలా మాట్లాడారంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌక్ వద్ద ఆదివారం బీజేపీ నాయకులు దహనం చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం మాట్లాడుతూ బీజేపీని నేరుగా ఎదుర్కొనలేక రాహుల్‌గాంధీ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రధానికి వెంటనే క్షమాపణ లు చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు నాగేశ్వరరావు, మల్లికార్జున్, పెంటు, విజయ్, ప్రహ్లాద్, మురళీగౌడ్, రేణుక, రాము, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.