
కుంటుపడుతున్న మున్సిపాలిటీల అభివృద్ధి
కాగజ్‌నగర్‌టౌన్: నిధులు మంజూరు కాకపోవడంతో మున్సిపాలిటీల అభివృద్ధి కుంటుపడుతుందని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆదివారం మున్సిపాలిటీ బిల్లుపై చర్చలో భాగంగా ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 22 నెలలు అవుతున్నా కాగజ్‌నగర్ మున్సిపాలిటీకి రూ.22 కూడా ఇవ్వలేదని ఆరోపించారు. నిధులు లేమితో బల్దియాలో సమస్యలు రాజ్యమేలుతున్నాయని, కనీసం డ్రెయినేజీలు, సీసీ రోడ్లకు మరమ్మతులు చేసుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. అలాగే శానిటేషన్ వర్కర్లకు వేతనాలు ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వం తక్షణమే మున్సిపాలిటీలకు నిధులు మంజూరు చేసి అభివృద్ధికి సహకరించాలని కోరారు.