కాగజ్‌నగర్‌టౌన్: పీఆర్టీయూ జిల్లా కార్యవర్గాన్ని కాగజ్‌నగర్ పట్టణంలోని క్విన్స్ గార్డెన్‌లో రాష్ట్ర కార్యదర్శి మామిడాల తిరుపతయ్య, సుధాకర్ ఆధ్వర్యంలో ఆదివారం ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా శ్యామ్‌సుందర్, జి ల్లా ప్రధాన కార్యదర్శిగా మడిమడుగుల తిరుపతి, జిల్లా గౌరవ అధ్యక్షులుగా పార్వతి రాజేశ్వర్‌రావు, జిల్లా ఉపాధ్యక్షులుగా వేణు, షబ్బీ ర్, సత్యనారాయణ రాజు, రాజేశ్, పూర్ణిమ, రజియా సుల్తానా, జిల్లా అసోసియేట్ అధ్యక్షులుగా చిలుకూరి రవీందర్, శ్రీనివాస్, శారద, చంద్రకళ, జిల్లా సెక్రెటరీలుగా సురేశ్, సుమిత్ర, ఉమారాణి, సుప్రియ అరుణకుమారిని ఎన్నుకున్నారు. ఎన్నికల్లో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు కటకం మధుకర్, పలు మండలాల నాయకులు పాల్గొన్నారు.