
సిబ్బందిని క్రమబద్ధీకరించాలి
ఆసిఫాబాద్‌రూరల్: జాతీయ ఆరోగ్య మిషన్‌లో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బందిని క్రమబద్ధీకరించాలని జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ యూ నియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేశ్ అన్నా రు. జిల్లా కేంద్రంలోని మోడల్ స్కూల్‌లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో మా ట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదన్నారు. కార్మిక చట్టాలను ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి రద్దు చేసి కార్మికుల హక్కుల నాశనం చేసిందని మండిపడ్డారు. సమావేశంలో నాయకులు సురేశ్, చిరంజీవి, శ్రీనివాస్ పాల్గొన్నారు.