
ఎమ్మెల్యే ఫోన్ చేసినా స్పందించరా..?
ఆసిఫాబాద్‌అర్బన్: ‘అత్యవసరంలో రోగులు ఆస్పత్రికి వస్తే అందుబాటులో ఉండరు. కనీసం ఎమ్మె ల్యే ఫోన్ చేసినా లిఫ్ట్ చేయరా’ అంటూ ఎమ్మెల్యే కోవ లక్ష్మి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్, డీఎంహెచ్‌వోలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం రాత్రి ఓ గిరిజన గర్భిణి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబ సభ్యులు అదేరాత్రి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. మహిళకు వైద్యం అందించడంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే కోవ లక్ష్మికి ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే వెంటనే ఆస్పత్రి సూపరింటెండెంట్, డీఎంహెచ్‌వోకు ఫోన్ చేశారు. ఇద్దరూ స్పందించకపోవడంతో హుటాహుటినా ఆస్పత్రికి చేరుకున్నారు. ప్రజాప్రతినిధి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకుంటే, సామాన్యుల పరిస్థితి ఏంటని నిలదీశారు. మీ నంబర్ తనవద్ద లేదని సూపరింటెండెంట్ సమాధానం ఇచ్చారు. అనంతరం బాధితురాలిని మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలకు రెఫర్ చేశారు. అయితే 108 వాహనంలో డీజిల్ లేకపోవడంతో ఎమ్మెల్యే సొంత డబ్బులతో డీజిల్ పో యించి గర్భిణిని మంచిర్యాలకు తరలించారు. ప్ర స్తుతం గర్భిణి ఆరోగ్యం నిలకడగా ఉంది. రాష్ట్ర ప్ర భుత్వం అంబులెన్స్‌ల్లో ఇంధనం పోయించే స్థితిలో కూడా లేదని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. నాయకులు రవీందర్, కోవ సాయినాథ్ పాల్గొన్నారు.