
క్రీడాకారులకు ఆర్థికసాయం
ఆసిఫాబాద్‌అర్బన్: జాతీయస్థాయి నెట్‌బాల్ పోటీలకు ఎంపికైన జిల్లాకు చెందిన విద్యార్థి నులు శాలిని, నిహారికకు మంగళవారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆర్థికసాయం అందించారు. ఈ నెల 28 నుంచి 31 వరకు హర్యానా రాష్ట్రంలోని సుభాష్ చంద్రబోస్ స్టేడియంలో జరిగే పోటీల్లో వీరు పాల్గొననున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ జాతీయస్థాయి క్రీడల్లో రాణించి జిల్లాకు పేరు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో నెట్‌బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అలీబిన్ అహ్మద్, సభ్యులు తిరుపతి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.