
‘బీజేపీ, కాంగ్రెస్ పార్టీలే కారణం’
కాగజ్‌నగర్‌రూరల్: తెలంగాణలో యూరియా కొరతకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలే కారణమని బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. కాగజ్‌నగర్ మండలం కోసినిలోని ప్రాణహిత భవనంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రైతులు రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేస్తుంటే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు డ్రామాలు చేస్తున్నాయని మండిపడ్డారు. రైతు సంఘాలు, వ్యవసాయ అధికారులతో సీఎం సమీక్షలు నిర్వహించకుండా.. సినీ దర్శకులు, నిర్మాతలతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సిర్పూర్ నియోజకవర్గంలో 50 శాతం యూరియా పంపిణీ పెండింగ్‌లో ఉందని, తెలిపారు. సానుభూతి కోసం ఎమ్మెల్యే హరీశ్‌బాబు ధర్నా డ్రామా చేపట్టారని ఆరోపించారు. అనంతరం పట్టణంలోని నౌగాంబస్తీ కాలనీకి చెందిన పలువురు యువకులు బీఆర్‌ఎస్‌లో చేరారు. సమావేశంలో నియోజకవర్గ కన్వీనర్ శ్యామ్‌రావు, నాయకులు సత్యనారాయణ, వెంకటేశ్, మినాజ్, అంజన్న, పార్వతి, వరలక్ష్మి, కమల తదితరులు పాల్గొన్నారు.