
ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు జరుపుకోవాలి
కాగజ్‌నగర్‌టౌన్: గణేశ్ నవరాత్రి ఉత్సవాలు అందరూ కలిసి కట్టుగా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కాగజ్‌నగర్ డీఎస్పీ రామానుజన్ అన్నారు. శనివారం సిర్పూర్ (టి) మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్సవా ల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మండపాల నిర్వాహకులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నా రు. నిబంధన ల మేరకు అన్ని అనుమతులు తీసుకోవాలన్నారు. అనంతరం ఉత్సవాల్లో నిర్వహించే కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. కౌటాల సీఐ సంతోష్‌కుమార్, ఎస్సై కమలాకర్, వినాయక మండపాల నిర్వాహకులు, నాయకులు పాల్గొన్నారు.