
పనుల జాతరపై శ్వేతపత్రం విడుదల చేయాలి
కాగజ్‌నగర్‌టౌన్: కాంగ్రెస్ ప్రభుత్వ ం పను ల జాతర పేరుతో కొత్త పథ కం తీసుకువచ్చిందని, ఇందులో ఏ యే పనులు చేపట్ట నున్నారో శ్వేతపత్రం విడుదల చేయాలని ఎమ్మె ల్యే పాల్వాయి హరీశ్‌బాబు అన్నారు. శనివా రం తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2,200 కోట్లతో పనుల జాతర అని చెబుతున్నారని, 18 నెలలుగా గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయకపోడంతో పారిశుద్ధ్య కార్మికులకు జీతా లు ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. గ్రా మాల్లో కనీసం బ్లీచింగ్ పౌడర్ కొనుగోలు చేసే పరిస్థితి లేదన్నారు. పనుల జాతర పేరుతో ప్రభుత్వం డ్రామా ఆడుతోందని ఆరోపించారు.