
‘పొలాల’ సంబరాలు
ఆసిఫాబాద్: పొలాల అమావాస్యను శనివారం జిల్లా ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. పండుగను పురస్కరించుకుని రైతులు తమ ఎడ్లను వివిధ రంగులతో అలంకరించి నైవేద్యం సమర్పించారు. ఉదయం ఇళ్లల్లో మట్టితో చేసిన ఎడ్లకు ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి జిల్లా కేంద్రంలోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి ఎడ్లకు ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం జిల్లా కేంద్రంలోని దస్నాపూర్, బెస్తవాడ, బనార్‌వాడ, తేలివాడతో పాటు పలు కాలనీలకు చెందిన రైతులు మేళతాళాలు, డప్పు చప్పుళ్ల మధ్యన నృత్యాలు చేస్తూ ఎడ్లతో ఊరేగింపు నిర్వహించారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి, డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాదరావు, బీజేపీ జిల్లా నాయకుడు అరిగెల నాగేశ్వర్ రావు, మాజీ సర్పంచ్ మర్సోకోల సరస్వతి, సింగిల్‌విండో చైర్మన్ అలిబిన్ అహ్మద్, ఏఎంసీ మాజీ చైర్మన్ చిలువేరు వెంకన్న, తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీలో రైతులు ‘హహరహర మహాదేవ్’ అంటూ నినాదాలు చేశారు. దస్నాపూర్ నుంచి అంబేడ్కర్ చౌక్ వరకు రహదారిపై ఎడ్లతో సందడిగా మారింది. పట్టణంలోని పలు ఆలయాల చుట్టూ ఎడ్లతో ప్రదక్షణలు చేశారు. కాగజ్‌నగర్‌లో ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు నివాసంలో ఎడ్లకు ప్రత్యేక పూజలు చేశారు.
కాగజ్‌నగర్‌టౌన్: ఎద్దుకు పూజ చేస్తున్న ఎమ్మెల్యే
ఎద్దులకు పూజలు చేస్తున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి

‘పొలాల’ సంబరాలు