
అర్హులందరికీ రేషన్ కార్డులు
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
జైనూర్(ఆసిఫాబాద్): జిల్లాలో అర్హులందరికీ రేషన్ కార్డులు అందిస్తామని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో గురువారం అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విశ్వనాథ్‌రావుతో కలిసి రేషన్‌కార్డు మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ జైనూర్ మండలంలో 913 నూతన రేషన్ కార్డు మంజూరు చేయగా, 1,595 మంది సభ్యుల పేర్లు నమోదు చేశామని తెలిపారు. అనంతరం జైనూర్‌లో చేయూత పింఛన్ల పంపిణీని పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్ బీర్శావ్ తదితరులు ఉన్నారు.
సన్నబియ్యం సద్వినియోగం చేసుకోవాలి
లింగాపూర్(ఆసిఫాబాద్): ప్రజా పంపిణీ వ్యవస్థలో రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న సన్నబియ్యాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. సిర్పూర్(యూ) మండలంలోని మహగాం రైతువేదికలో గురువారం సిర్పూర్(యూ), లింగాపూర్ మండలాలకు చెందిన లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డు మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ సిర్పూర్(యూ) మండలానికి 241, లింగాపూర్ మండలానికి 304 కార్డులు మంజూరయ్యాయని తెలిపారు. అంతకు ముందు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. అవుట్ పేషెంట్, రిజిస్టర్, ఔషధాల గది, ఆస్పత్రి పరిసరాలు పరిశీలించారు. వైద్యం కోసం వచ్చిన విద్యార్థినులతో మాట్లాడారు. వర్షాకాలం నేపథ్యంలో వ్యాధులు ప్రబలకుండా అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మెత విశ్వనాథ్, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, పౌర సరఫరాల అధికారి సాదిక్, తహసీల్దార్ ప్రహ్లాద్ తదితరులు పాల్గొన్నారు.