రేషన్‌కార్డులు సద్వినియోగం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

రేషన్‌కార్డులు సద్వినియోగం చేసుకోవాలి

Aug 2 2025 6:50 AM | Updated on Aug 2 2025 6:50 AM

రేషన్‌కార్డులు సద్వినియోగం చేసుకోవాలి

రేషన్‌కార్డులు సద్వినియోగం చేసుకోవాలి

చింతలమానెపల్లి: ప్రభుత్వం అందిస్తున్న రేషన్‌ కార్డులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే అన్నారు. మండలంలోని బాలాజీ అనుకోడ రైతువేదికలో శుక్రవారం ఎమ్మెల్సీ దండె విఠల్‌, అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధా శుక్లాతో కలిసి రేషన్‌కార్డులు పంపిణీ చేశా రు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఆహార భద్రత కోసం ప్రభుత్వం రేషన్‌కార్డులు అందిస్తుందన్నారు. బియ్యం విక్రయిస్తే కార్డు రద్దు చేస్తామని, డీలర్లు అక్రమాలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామ ని హెచ్చరించారు. అక్రమంగా బియ్యం కొని బ్లాక్‌ మార్కెట్‌కు తరలించే వారిపై పీడీ యాక్టు నమోదు చేస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ హామీల అమలులో భాగంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం రేషన్‌కార్డులు అందిస్తుందన్నా రు. మండలంలోని దిందా వాగు వంతెన నిర్మా ణం వర్షాకాలం ముగియగానే ప్రారంభమవుతుందని తెలిపారు. ఖర్జెల్లి నుంచి గూడెం రహదా రికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. అటవీ అనుమతులు రానిచోట మినహా అన్ని అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏడీఏ మనోహర్‌, తహసీల్దార్‌ మడావి దౌలత్‌, ఎంపీడీవో సుధాకర్‌రెడ్డి, ఏవో కీర్తీషా, కాంగ్రెస్‌ పార్టీ మండలాధ్యక్షుడు సుల్కరి ఉమామహేశ్‌, పార్టీ యూత్‌ అధ్యక్షుడు బండి మహేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

కౌటాల: ప్రజల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్సీ దండె విఠల్‌ అన్నారు. కౌటాలలోని రైతువేదికలో శుక్రవారం కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రేతో కలిసి రేషన్‌ కార్డులు పంపిణీ చేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ కౌటాల మండలానికి 656 కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేయగా, 1,064 మంది సభ్యుల పేర్లు నమోదు చేశామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధా శుక్లా, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ దేవయ్య, తహసీల్దార్‌ ప్రమోద్‌, సహకార సంఘం చైర్మన్‌ మాంతయ్య పాల్గొన్నారు.

నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించాలి

కాగజ్‌నగర్‌రూరల్‌: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించాలని కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే అన్నారు. కాగజ్‌నగర్‌ మండలంలోని గన్నారం జెడ్పీ ఉన్నత పాఠశాలను శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. తరగతి గదులు, వంటశాల, రిజిస్టర్‌, పాఠశాల పరిసరాలను పరిశీలించారు. పదో తరగతి విద్యార్థుల విద్యా సామర్థ్యాలు తెలుసుకున్నారు. పాఠశాలకు హాజరు కాని విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి పాఠశాలకు వచ్చే విధంగా చొరవ తీసుకోవాలని సూచించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. ప్రధానోపాధ్యాయుడు హనుమంతు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement