
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లా కేంద్రంలోని ఆదర్శ క్రీడాపాఠశాలకు చెందిన 12 మంది విద్యార్థినులు రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారని డీటీడీవో రమాదేవి తెలిపారు. శుక్రవారం పాఠశాల ఆవరణలో డీఎస్‌వో మీనారెడ్డితో కలిసి క్రీడాకారులను అభినందించారు. డీటీడీవో మాట్లాడుతూ ఇటీవల జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభ చూపి 12 మంది రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారని తెలి పారు. వీరు ఈ నెల 3, 4 తేదీల్లో హన్మకొండలో జరిగే పోటీల్లో పాల్గొంటారన్నారు. హెచ్‌ఎం జంగు, ఏటీడీవో చిరంజీవి, అథ్లెటిక్స్ కోచ్ విద్యాసాగర్ పాల్గొన్నారు.
జావెలిన్ త్రో పోటీలకు సాక్షి..
జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ బైపీసీ చదువుతున్న సాక్షి జావెలిన్ త్రో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై ందని ప్రిన్సిపాల్ రాందాస్ తెలిపారు. శుక్రవారం కళాశాలలో విద్యార్థినిని అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అధ్యాపకులు శ్రీనివాస్, సంతోష్ పాల్గొన్నారు.