
‘పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరికీ గుర్తింపు’
ఆసిఫాబాద్‌అర్బన్: కాంగ్రెస్‌ను క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని, పార్టీ కోసం పనిచేసే ప్రతిఒక్కరికీ గుర్తింపు దక్కుతుందని ఏఐసీసీ కార్యదర్శి, రాష్ట్ర ఇన్‌చార్జి సుభాష్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే దండె విఠల్, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావుతో కలిసి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ సత్తా చూపాలన్నారు. వార్డు, గ్రామస్థాయిలో బలోపేతంగా ఉంటేనే పార్టీ పటిష్టంగా ఉంటుందన్నారు. ఆ దిశగా కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. అసెంబ్లీ, మండల, గ్రామ పంచాయతీల్లో సమావేశాలు ఏర్పాటు చేసి నాయకులను తయారు చేస్తామని తెలిపారు. ఎమ్మెల్సీ దండె విఠల్ మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి కాంగ్రెస్‌ను బలోపేతం చేయడంలో కార్యకర్తల పాత్ర కీలకమన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకు 20 శాతం టికెట్లు కేటాయించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ సిడాం గణపతి, మాజీ ఎంపీపీలు బాలేశ్వర్‌గౌడ్, గజ్జి రామయ్య, నాయకులు ప్రకాశ్‌రావు, రమేశ్, చరణ్, వసంత్‌రావు, మహేశ్‌గౌడ్, మునీర్ అహ్మద్, గోపాల్‌నాయక్, శివ, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.