
● ప్రధాన మంత్రి సురక్ష యోజన అమలు ● బీమా లేని వారిని గుర
వాంకిడి(ఆసిఫాబాద్): గ్రామీణ ప్రాంతాల కూలీల కు స్థానికంగానే వంద రోజులపాటు ఉపాధి కల్పించి వలసలు నివారించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ పథకాన్ని అమలు చేస్తుంది. అ యితే పనులకు వెళ్లిన వారు ప్రమాదానికి గురై మృతి చెందడమో.. లేక పూర్తి అంగవైకల్యం పొందే అవకాశాలు ఉంటాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఉపాధి కూలీల కుటుంబం రోడ్డున పడకుండా బీమాతో భరోసా కల్పించేందుకు కార్యాచరణ రూపొందించింది. ఉపాధిహామీ జాబ్ కార్డు కలి గిన ప్రతీ కూలీకి ప్రధాన మంత్రి సురక్ష పథకాన్ని అమలు చేయనుంది. ఇప్పటివరకు ఉపాధి కూలీల కు ఎలాంటి బీమా సౌకర్యం లేదు. కూలీలతో కొంత ప్రీమియం సోమ్ము చెల్లింపజేసి, వారికి బీమా క ల్పించనుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు వివరా లు సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. బీమాకు సంబంధించి ఉన్నతాధికారుల నుంచి మండల సిబ్బందికి ఆదేశాలు జారీ అయ్యాయి.
రూ.20లతో రూ.2 లక్షల బీమా
జిల్లాలో మొత్తం 1,23,103 జాబ్ కార్డులు ఉండగా 89,430 యాక్టివ్ జాబ్ కార్డులు ఉన్నాయి. ఇందులో 2,44,358 మంది కూలీలు పేర్లు నమోదు చేసుకోగా, 1,65,479 మంది యాక్టివ్‌గా పని చేస్తున్నారు. వీరందరికి బీమా వర్తింపజేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన కోసం 18 నుంచి 70 ఏళ్లలోపు వారు అర్హులు. వీరంతా బ్యాంకుల్లో పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఖాతా ఆధార్‌తో అనుసంధానమై ఉండాలి. బ్యాంకు ఖాతా ఉన్న బ్రాంచులో ఖాతా నుంచి ప్రతీ సంవత్సరం రూ.20 ప్రీమియం కింద బీమా కోసం జమ చేస్తామని అంగీకార పత్రాన్ని బ్యాంకులో ఇవ్వాలి. పేరు నమోదు చేసుకున్న వారు ఎవరైనా ప్రమాదవశాత్తు మరణించినా.. పూర్తి వైకల్యం కలిగినా పీఎం సురక్ష యోజన ద్వారా రూ.2లక్షల పరిహారం అందించనున్నారు. జిల్లాలో ఉపాధిహామీ పథకం కింద పనిచేస్తున్న కూలీలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.

● ప్రధాన మంత్రి సురక్ష యోజన అమలు ● బీమా లేని వారిని గుర