
మానవ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలి
కాగజ్‌నగర్‌టౌన్: మానవ అక్రమ రవాణకు అడ్డుకట్ట వేసేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని డీసీపీవో బి.మహేశ్ అన్నారు. మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకుని బుధవారం కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్‌లో షూర్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మానవ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడం అందరి బాధ్యత అన్నారు. అమాయక ప్రజలను నమ్మించి ఉద్యోగం కల్పిస్తామని నమ్మించి తరలిస్తున్నారని పేర్కొన్నారు. మహిళలు, పిల్లలను ప్రలోభాలకు గురిచేసి అక్రమంగా రవాణా చేస్తున్నారన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ప్రలోభాలకు గురిచేస్తే 1098, డయల్ 100, 112 నంబర్లకు సమాచారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్పీఎఫ్ సీఐ రమణ్‌కుమార్ ఎస్సై ప్రాచీదేవి, ఏఎస్సై దాసు, కమర్షియల్ సీఐ కార్తీక్, టౌన్ ఎస్సై యాదగిరి, చైల్డ్ హెల్ప్‌లైన్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ ప్రవీణ్, ఎన్జీవో జి ల్లా కోఆర్డినేటర్ సంతోష్, సూజర్‌వైజర్లు సంతోష్ కుమార్, దేవాజీ, ప్రభు తదితరులు పాల్గొన్నారు.