
స్వచ్ఛత పాటిస్తే ఆరోగ్యం
కెరమెరి(ఆసిఫాబాద్): స్వచ్ఛత పాటిస్తే ఆరో గ్యంగా ఉండవచ్చని, వ్యాధులు దరిచేరవని డీఎంహెచ్‌వో సీతారాం అన్నారు. మండలంలోని చిత్తగూడ గ్రామాన్ని బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆదివాసీలతో మా ట్లాడారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందుతుందని, ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లొద్దని సూచించారు. రూ.5వేల ఖరీదైన పరీ క్షలు పీహెచ్‌సీల్లో చేస్తారని తెలిపారు. ఇళ్ల ఆవరణలో చెత్తాచెదారం పేరుకుపోకుండా చూసుకోవాలన్నారు. మురుగు నీరు నిల్వ ఉంటే దోమలు వృద్ధి చెందుతాయన్నారు. దోమ తెరలు వాడాలని, కాచి చల్లార్చిన నీటిని తాగాలని సూచించారు. గర్భిణులు, బాలింతలు సకాలంలో వైద్యపరీక్షలు చేయించుకోవాలన్నారు. ఆది వాసీలకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ షఫియోద్దీన్, సిబ్బంది రవిదాస్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.