
మాలీలను ఎస్టీ జాబితాలో చేర్చాలి
కాగజ్‌నగర్‌టౌన్: మాలీ కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు కోరారు. ఈ మేరకు బుధవారం ఢిల్లీలో కేంద్ర సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి రాందాస్ అలావలెను కలిశారు. తెలంగాణ రాష్ట్రంలోని మాలీ(బారె) కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలని గతంలో అసెంబ్లీలో తీర్మానం చేశారని తెలిపారు. సానుకూలంగా స్పందించిన కేంద్ర సహాయ మంత్రి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
కేంద్ర సహాయ మంత్రికి
వినతిపత్రం ఇస్తున్న ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు