
ఉత్తమ పురస్కారానికి ఎంపిక
సిర్పూర్(టి): అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పులుల సంరక్షణలో అత్యుత్తమ ప్రతిభ చూపిన అధికారులు, సి బ్బందికి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ పురస్కారాలు అందించింది. ఈ సందర్భంగా సిర్పూర్(టి) రేంజ్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న ఎఫ్ ఎస్‌వో మోహన్‌రావ్ ఉత్తమ పురస్కారానికి ఎంపికయ్యారు. హైదరాబాద్‌లో మంగళవా రం నిర్వహించిన కార్యక్రమంలో పీసీసీఎఫ్ సువర్ణ, చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ ఏలూసింగ్ మేరు చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. కాగజ్‌నగర్ డివిజన్ పరిధిలో పులుల ఉనికికి అవసరమైన చర్యలు తీసుకోవడం, ట్రాకింగ్‌లో ఉత్త మ సేవలు అందించినందుకు అవార్డు వరించిందని ఎఫ్‌ఆర్‌వో ప్రవీణ్‌కుమార్ తెలిపారు. అటవీశాఖ అధికారులు, సిబ్బంది మోహన్‌రావ్‌ను అభినందించారు.