
కలెక్టరేట్‌లో స్టాల్స్ ఏర్పాటు
ఆసిఫాబాద్‌అర్బన్: మహిళా సంఘాల ఆధ్వర్యంలో తయారు చేసిన తినుబండారాలు, వస్తువులు విక్రయించేందుకు వీలుగా జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో బుధవారం ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. కలెక్టరేట్‌కు వివిధ పనుల నిమిత్తం వచ్చిన ప్రజలు స్టాల్స్‌ను సందర్శించారు. 500 గ్రాముల తేనె రూ.300, మామిడి, నిమ్మ, చింతకాయ, ఉసిరి, టమాట, పచ్చళ్లు కేజీ రూ.400కి విక్రయిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అలాగే కేజీ చికెన్ పచ్చడి రూ.1200, మిల్లెట్ బిస్కెట్లు రూ.100, మల్టీ గ్రైన్ స్వీట్లు కేజీ రూ.200, మల్టీ గ్రైన్ హాట్ కేజీ రూ.150కి విక్రయిస్తున్నారు. ఈ స్టాల్స్ ఐదు రోజులపాటు కొనసాగుతాయని డీఆర్‌డీఏ అధికారులు వెల్లడించారు.