
రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ
కెరమెరి(ఆసిఫాబాద్): రేషన్‌కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని, అర్హులు మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే నెలరోజుల్లో అందిస్తామని ఎమ్మెల్సీ దండె విఠల్, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. కెరమెరి మండలం కేస్లాగూడలోని రైతువేదికలో మంగళవారం నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ పదేళ్లుగా రేషన్ కార్డుల జారీ లేక ప్రజలు ఇబ్బందులు పడ్డారని, కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతులు ఎదురుచూశారని తెలిపారు. అలాంటి వారికి భరోసా కల్పించేందుకు ప్రభుత్వం నూతన కార్డులు జారీ చేస్తుందన్నారు. బియ్యం విక్రయిస్తే చర్యలు తప్పవన్నారు. అన్ని పథకాలకు రేషన్ కార్డు ప్రామాణికమని స్పష్టం చేశారు. మహిళలను కోటీశ్వరులు చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఆర్డీవో లోకేశ్వరరావు, ఇన్‌చార్జి డీఎస్‌వో సాదిక్, ఏడీఏ వెంకట్, తహసీల్దార్ భూమేశ్వర్, డీటీ సంతోష్‌కుమార్, ఎంపీడీవో అంజద్‌పాషా, డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్, అసెంబ్లీ ఇన్‌చార్జి శ్యాంనాయక్, నాయకులు పాల్గొన్నారు.