
పోలీసులు నిబద్ధతతో పనిచేయాలి
జైనూర్(ఆసిఫాబాద్): పోలీసులు నిబద్ధతతో పనిచేయాలని ఏఎస్పీ చిత్తరంజన్ అన్నారు. మండల కేంద్రంలోని పోలీసు స్టేషన్, సర్కిల్ కార్యాలయాన్ని మంగళవారం తనిఖీ చేశారు. రికార్డుల నిర్వహణ, స్టేషన్ పరిసరాల శుభ్రత, సిబ్బంది విధులు, తదితర అంశాలపై సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ స్టేషన్ రికార్డులు సక్రమంగా నిర్వహించాలని, నేరస్తులపై నిరంతరం నిఘా కొనసాగించాలన్నారు. గ్రామ చరిత్ర షీట్లను పూర్తిస్థాయిలో అప్‌డేట్ చేయాలని సూచించారు. మహిళల ఫిర్యాదుల విషయంలో సున్నితంగా వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో సీఐ రమేశ్, ఎస్సై రవికుమార్, సిబ్బంది పాల్గొన్నారు.