
జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభం
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని గిరిజన ఆద ర్శ క్రీడా పాఠశాల ఆవరణలో సోమవారం అండర్ 14, 16, 18, 20 బాలబాలికల జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. జిల్లాకు చెందిన 200 మంది విద్యార్థులు హాజరయ్యారు. ప్రతిభ చూపినవారు ఆగస్టు 3, 4 తేదీల్లో హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగే 11వ తెలంగాణ రాష్ట్రస్థాయి జూని యర్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొంటారని జిల్లా క్రీడల అధికారి బండ మీనారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఏసీఎంవో ఉద్దవ్, ఏటీడీవో చిరంజీవి, హెచ్‌ఎం జంగు, అథ్లెటిక్స్ అసోసియేషన్ కోశాధికారి మంగపతి, సంయుక్త కా ర్యదర్శి హరికృష్ణ, కోచ్‌లు విద్యాసాగర్, అరవింద్, వనిత, పీడీ, పీఈటీలు వెంకటేశ్, శార ద, బాలాజీ, మంజుల పాల్గొన్నారు.