
పకడ్బందీగా పథకాలు అమలు చేయాలి
ఆసిఫాబాద్: జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేయాలని అదన పు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరును సోమవారం పరిశీలించారు. ఇందులో భాగంగా ఆసిఫాబాద్ మండలం అడ పీ హెచ్‌సీ తనిఖీ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పరిశీలించారు. జన్కాపూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల తనిఖీ చేశారు. ఆర్‌ఆర్ కాలనీలో చేపడుతున్న అభివృద్ధి ప నులు పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం, శుద్ధమై న తాగునీరు అందించాలని ఆదేశించారు.