జీవో 49 రద్దే లక్ష్యంగా ఉద్యమిస్తాం | - | Sakshi
Sakshi News home page

జీవో 49 రద్దే లక్ష్యంగా ఉద్యమిస్తాం

Jul 29 2025 8:30 AM | Updated on Jul 29 2025 9:01 AM

జీవో

జీవో 49 రద్దే లక్ష్యంగా ఉద్యమిస్తాం

ఆసిఫాబాద్‌అర్బన్‌: కుమురంభీం కన్జర్వేషన్‌ పేరుతో తెచ్చిన జీవో 49ను పూర్తిగా రద్దు చేసేవరకు ఉద్యమిస్తామని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు కోట్నాక విజయ్‌ స్పష్టం చేశారు. ఆదివాసీ సంఘాల జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు కోవ విజయ్‌ అధ్యక్షతన సోమవారం కలెక్టరేట్‌ ఎదుట మహాధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆదివాసీ చట్టాలను తుంగలో తొక్కి, పెసా చట్టాన్ని పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం దొడ్డిదారిన జీవో తెచ్చిందని ఆరోపించారు. కుమురంభీం, బీర్సా ముండా, రాంజీగోండు స్ఫూర్తితో ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆదివాసీల కు న్యాయం చేస్తే సీఎం రేవంత్‌రెడ్డికి పాలాభిషే కం చేస్తామని తెలిపారు. జీవో రద్దు కోసం ఆగస్టు 1 నుంచి శాంతియుత ఉద్యమ కార్యాచరణ కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి కోసమే..

సిర్పూర్‌ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు మా ట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ప్రభుత్వం జీవో 49ను తాత్కాలికంగా రద్దు చేసిందని ఆరోపించారు. ఎన్నికల్లో కాంగ్రెసేతర పార్టీలకు మద్దతు పలికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఆది వాసీలు సత్తా చూపాలని కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. సర్పంచులు, వార్డు సభ్యులు లేకుండా 339 గ్రామాల్లో ఎలా తీర్మానం చేశారని ప్రశ్నించారు. వచ్చే నెల 4న కాగజ్‌నగర్‌ డివిజన్‌ కార్యాలయాన్ని ముట్టడిస్తామని తెలిపారు. కాగా మహాధర్నాకు బీజేపీ, బీఆర్‌ఎస్‌, సీపీఐ, సీపీఎం పార్టీలు మద్దతు తెలి పాయి. అంతకు ముందు ఆదివాసీ భవన్‌ నుంచి ర్యాలీగా బయలుదేరి కుమురంభీం విగ్రహానికి నివాళులర్పించారు. కలెక్టరేట్‌లో వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లగా, పోలీసులు పరిమిత సంఖ్య లో మాత్రమే అనుమతించారు. స్థానిక సీఐ రవీందర్‌తోపాటు వాంకిడి సీఐ సత్యనారాయణ బందోబస్తు పర్యవేక్షించారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ వైస్‌ చైర్మన్‌ కోనేరు కృష్ణారావు, నాయకులు అరిగెల నాగేశ్వర్‌రావు, మల్లికార్జున్‌, కొప్పుల శంకర్‌, పెంటయ్య, కనక ప్రభాకర్‌, మడావి శ్రీని వాస్‌, మాంతయ్య, గణేష్‌, దుర్గం దినకర్‌, కార్తీ క్‌, శ్రీనివాస్‌, ఆనంద్‌, కృష్ణమాచారి, దివాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు కోట్నాక విజయ్‌

జిల్లా కేంద్రంలో ఆదివాసీల మహాధర్నా

పాల్గొన్న ఎమ్మెల్యే హరీశ్‌బాబు

జీవో 49 రద్దే లక్ష్యంగా ఉద్యమిస్తాం1
1/1

జీవో 49 రద్దే లక్ష్యంగా ఉద్యమిస్తాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement