
గిరిజనుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలి
ఆసిఫాబాద్‌అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల సంక్షేమానికి, వారి హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. హైదరాబా ద్‌లోని డీఎస్‌ఎస్ భవనంలో సోమవారం గిరిజన సంక్షేమం, అభివృద్ధి అనే అంశంపై ఏడో గిరిజన సలహా మండలి సమావేశం నిర్వహించారు. ఎమ్మె ల్యే మాట్లాడుతూ ఆసిఫాబాద్ నుంచి ఆదిలాబాద్ వరకు గల రహదారిని తక్షణమే పునర్నించాలన్నా రు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో చాలా మంది నిరుపేదలు ఉన్నారని, వారికి అడ్వాన్స్ ఇవ్వకుండా ఇళ్లు నిర్మాణం సాధ్యం కాదన్నారు. లబ్ధిదారులకు ముందుగానే రూ.లక్ష ఇవ్వాలని కోరారు. అటవీ హక్కుల చట్టం అమలు, పోడు భూముల సమస్య ల పరిష్కారం, గిరిజన ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ వంటి అంశాలపై దృష్టి సారించాలన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించడం ద్వారా గిరిజన యువతను ఆర్థికంగా బలోపేతం చేయాలన్నారు. డీఎస్‌ఎస్ భవనంలో మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్‌ను ఎమ్మెల్యే మర్యాదపూర్వంగా కలిశారు. జిల్లాలోని 339 గ్రామ ప్రజలకు నష్టం కలిగించే జీవో 49 పూర్తి చేయాలని కోరారు.