
అన్నివర్గాల సంక్షేమానికి కృషి
సిర్పూర్(టి): రాష్ట్ర ప్రభుత్వం అన్నివర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందని ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. మండల కేంద్రంలోని రైతువేదికలో సోమవారం కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ సంక్షేమ పథకాలు వినియోగించుకోవాలని సూచించారు.
ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు
సిర్పూర్(టి): రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ సామాజిక ఆస్పత్రిని సోమవారం సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్యులు చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించారు. మధ్యాహ్న భోజనం పరిశీలించారు. మండల కేంద్రంలో ని ఫర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేశారు. దుకాణాల్లో స్టాక్ వివరాలు బోర్డుపై ప్రదర్శించాలని సూచించారు. తహసీల్దార్ రహీముద్దీన్, ఏడీఏ మనోహర్, ఎంపీడీవో సత్యనారాయణ, ఎంఈవో వేణుగోపాల్, సిబ్బంది ఉన్నారు.