
బీసీ బాలికల వసతి గృహం తనిఖీ
కాగజ్‌నగర్‌టౌన్/ఆసిఫాబాద్: కాగజ్‌నగర్ పట్టణంలోని బీసీ బాలికల వసతిగృహాన్ని సోమవారం జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి సజీవన్ తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనంతోపా టు హాజరు పట్టిక పరిశీలించారు. విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నారు. మెనూ ప్రకా రం భోజనం అందించాలని వార్డెన్ రేష్మ బానుకు సూచించారు.
సిబ్బందిపై చర్యలు
విద్యార్థులకు భోజనం సక్రమంగా పెట్టడం లేదని ఓ వీడియో ద్వారా తమ దృష్టికి రావడంతో విధుల్లో నిర్లక్ష్యం వహించిన వంటమనిషిని సస్పెండ్ చేయడంతోపాటు ఇద్దరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను విధుల నుంచి తొలగించినట్లు ఆయన తెలిపారు. ఆదివారం వార్డెన్, వంట మనిషి హాజరుకాకపోవడంతో విద్యార్థినులు స్వయంగా అల్పహారం, భోజనం వండుకున్నట్లు తెలిసిందని, దీనిపై విచారణ జరిపి కలెక్టర్‌కు నివేదిక సమర్పించినట్లు తెలిపారు. వంట మనిషి, ఇద్దరు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులపై చర్యలు తీసుకోవడంతోపాటు అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న వార్డెన్‌ను తొలగించి, మరో వార్డెన్‌ను నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించారు.