ఆసిఫాబాద్‌రూరల్: జిల్లా కేంద్రంలో ఆదివారం సీఆర్‌టీ పోస్టుల భర్తీతోపాటు గ్రామ పాలన అధికారి(జీపీవో), లైసెన్స్‌డ్ సర్వేయర్ పోస్టుల కోసం రాత పరీక్షలు నిర్వహించారు. సీఆర్‌టీ పరీక్ష కోసం జిల్లా కేంద్రంలో మూడు సెంటర్లు ఏర్పాటు చేశారు. 1,137 మంది అభ్యర్థులకు 1,086 మంది హాజరు కాగా 51 మంది గైర్హాజరయ్యారు. ప్రభుత్వ బాలుర, బాలికల, గిరిజన బాలుర(పీటీజీ)లోని సెంటర్లను అదనపు కలెక్టర్ దీపక్ తివారి, డీటీడీవో రమాదేవి పర్యవేక్షించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లైసెన్స్‌డ్ సర్వేయర్ల రాత పరీక్షను రెండు సెషన్లలో నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగిన పరీక్షకు 97 మంది 80 మంది హాజరు కాగా 17 మంది గైర్హాజరయ్యారు. సెకండ్ సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించగా, 97 మందికి 80 మంది హాజరయ్యారు. ఇక జన్కాపూర్ ఉన్నత పాఠశాలలో గ్రామ పాలన అధికారుల అర్హత పరీక్ష నిర్వహించారు. 35 మందికి 33 మంది హాజరు కాగా ఇద్దరు గైర్హాజరయ్యారు. ఒకేరోజు మూడు పరీక్షలు ఉండటంతో జిల్లా కేంద్రంలో సందడి నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు చేపట్టారు.
ప్రశాంతంగా సీఆర్‌టీ, జీపీవో, లైసెన్స్‌డ్ సర్వేయర్ పరీక్షలు
జిల్లా కేంద్రంలో సెంటర్లు ఏర్పాటు
ఒకేరోజు మూడు పరీక్షలు
ఒకేరోజు మూడు పరీక్షలు