
దెబ్బతిన్న సిమెంట్ లైనింగ్
పెంచికల్‌పేట్(సిర్పూర్): పెంచికల్‌పేట్ మండలం ఎల్లూరు గ్రామ శివారులో ప్రభుత్వం రెండు వేల ఎకరాలకు సాగునీటిని అందించడానికి బొక్కివాగు ప్రాజెక్టు నిర్మించింది. కుడి, ఎడమ కాలువల ద్వారా కోయచిచ్చాల, పెంచికల్‌పేట్, ఎల్లూరు, గన్నారం గ్రామాల్లో పొలాలకు నీటిని సరఫరా చేసేందుకు కాలువలు ఏర్పాటు చేశారు. అయితే వాటికి కొన్నేళ్లుగా మరమ్మతులు చేపట్టడంలేదు. కాలువలకు ఇరువైపులా ఉన్న సిమెంట్ లైనింగ్ కూలిపోయింది. మరోవైపు పూడిక చేరడంతో 500 ఎకరాలకు సైతం సాగునీరందని పరిస్థితి నెలకొంది. తూములు దెబ్బతిని ప్రాజెక్టులోని నీరు నిరంతరం వృథాగా పోతుంది.
మరమ్మతు చేయాలి
13 ఏళ్ల క్రితం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేశారు. కాలువల్లో మట్టి చేరడంతో పొలాలకు నీరందడం లేదు. పంటల సాగు కష్టంగా మారింది. అధికారులు స్పందించి కాలువలు, తూము వద్ద గేట్లకు మరమ్మతు చేయాలి.
– పాగిడె కిరణ్, రైతు, ఎల్లూరు

దెబ్బతిన్న సిమెంట్ లైనింగ్