
సన్మార్గంలో నడవాలి
కాగజ్‌నగర్‌రూరల్: యువత సన్మార్గంలో నడవాలని కాగజ్‌నగర్ రూరల్ సీఐ కుమారస్వామి అన్నారు. కాగజ్‌నగర్ మండలం అనుకోడ గ్రామంలో ఆదివారం పోలీసులు మీకోసం కార్యక్రమం నిర్వహించారు. సీఐ మాట్లాడుతూ యువత గుడుంబా, గంజాయి వంటి వాటికి దూరంగా ఉండాలని, ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. గ్రామంలో ఇంటింటా తనిఖీలు చేపట్టి ఎలాంటి అనుమతులు లేని 20 మోటారు సైకిళ్లు, రెండు ఆటోలు, ఒక ట్రాక్టర్‌ను సీజ్ చేశారు. అదేవిధంగా 800 లీటర్ల గుడుంబా పానకంతో పాటు రెండు బస్తాల ఇప్పపువ్వు స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. కార్యక్రమంలో ఈజ్‌గాం ఎస్సై కల్యాణ్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.