
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
ఆసిఫాబాద్‌అర్బన్: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని, వనమహోత్సవం కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో శుక్రవారం వైద్య, నర్సింగ్ కళాశాల విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఆస్పత్రి ఆవరణలో పండ్లు, పూల మొక్కలు నాటాలని సూచించారు. అనంతరం ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాలను సందర్శించారు. ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతిగృహాలు, గురుకులాల్లో అదనపు తరగతి గదులు, శుద్ధమైన తాగునీరు, విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. అనంతరం తరగతి గదిలో విద్యార్థులను ప్రశ్నలు అడిగి, వారి విద్యా సామర్థ్యాలు పరీక్షించారు. కార్యక్రమంలో ప్రభుత్వ ఆస్పత్రి పర్యవేక్షకుడు ప్రవీణ్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ శ్రీలక్ష్మి, ఇన్‌చార్జి డీఈవో ఉదయ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.