
లైబ్రరీలతో విద్యార్థుల్లో పఠనాసక్తి
ఆసిఫాబాద్‌రూరల్: పాఠశాలల్లో గ్రంథాలయా ల ఏర్పాటుతో విద్యార్థుల్లో పఠనాసక్తి పెరుగుతుందని జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికా రి శ్రీనివాస్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలి కల ఉన్నత పాఠశాలలో బుధవారం శక్తి వంతీ కరణ(పటిష్టత, బందోబస్తు) అంశంపై 90 మంది కాంప్లెక్స్ స్థాయి రిసోర్స్ పర్సన్లకు శిక్షణ నిర్వహించారు. విద్యార్థుల్లో పఠనాభిరుచి పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. ఎఫ్‌ఎల్‌ఎన్‌లో భాగంగా పుస్తకాలు చదివించాలన్నారు. ఏసీజీఈ ఉదయ్‌బాబు, ఎంఈవో సుభాష్, హెచ్‌ఎం విజయలక్ష్మి, రిసోర్స్‌పర్సన్లు చౌదరి వెంకటేశ్, జాదవ్ గోవింద్ తదితరులు పాల్గొన్నారు.