
చిత్తశుద్ధి ఉంటే శాశ్వతంగా రద్దు చేయాలి
ఆసిఫాబాద్‌అర్బన్: కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే జీవో 49ను శాశ్వతంగా రద్దు చేయాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. జిల్లా కేంద్రంలోని తన నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన వి లేకరుల సమావేశంలో మాట్లాడారు. జీవో 49ను రద్దు చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం ఓ బూటకపు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. చిత్తశుద్ధి ఉంటే తాత్కాలికంగా నిలుపుదల కాకుండా, పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జల్, జంగల్, జమీన్ హక్కుల కోసం పోరాడిన ఆదివాసీల ఆరాధ్య దైవం కుమురంభీం స్ఫూర్తితో జీవో 49 రద్దుకు ఎంతకైనా పోరాడుతామని హెచ్చరించా రు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే జీవో తీసుకురాగా, తిరిగి వారే రద్దు చేశామని ప్రకటించుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ నాయకుల ఒంటెద్దు పోకడలను ప్రజలు గమనిస్తున్నారని, వారి ని తరిమికొట్టే సమయం దగ్గరలోనే ఉందన్నారు. ఓట్ల కోసం కొత్త డ్రామాలు చేస్తున్నారని, ఆదివా సీ ప్రజలను ఆదివాసీ నాయకులే మోసం చేస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీలో జీవో రద్దు చేస్తున్నట్లు ప్రకటించాలని, లేనిపక్షంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఆదివాసీ సంఘాలు, ఇతర సంఘాలతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు బుర్స పోచయ్య, మర్సుకోల సరస్వతి, సిడాం శంకర్, జాబరి రవి, కిష్టయ్య, భీమేశ్, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి